భారత్-పాక్ మ్యాచ్‌లో పెళ్లి ప్రతిపాదన.. ప్రియురాలికి రింగు తొడిగి ‘మ్యాచ్’ ఫిక్స్!

  • మ్యాచ్ జరుగుతుండగా పెళ్లి ప్రతిపాదన
  • ప్రియురాలు ఓకే చెప్పడంతో ఉంగరం తొడిగిన ప్రియుడు
  • చప్పట్లు, కేరింతలతో అభినందించిన ప్రేక్షకులు
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ పెళ్లి ప్రపోజల్‌కు చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వైపు మ్యాచ్‌ను అందరూ ఆసక్తిగా తిలకిస్తుంటే మరోవైపు ఓ యువకుడు తన ప్రియురాలిని చూస్తూ ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ప్రశ్నించాడు. అతడి ప్రతిపాదనతో ఉబ్బితబ్బిబ్బైన ఆమె సంతోషంతో ఓకే చెప్పింది. దీంతో వెంటనే ముందే తెచ్చుకున్న ఉంగరం తొడిగి ఆమెను మరింత ఆశ్చర్యపరిచాడు.

అతడి ప్రపోజల్‌తో మైదానంలోని కెమెరాలన్నీ ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో  ఆ జంటను అభినందించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్‌కు వచ్చి ‘మ్యాచ్’ ఫిక్స్ చేసుకున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Go Back to Shorts
India
Pakistan
Cricket match
Marriage
Love

More Telugu News